Ma Galli lo Okkadu Poradu Song Lyrics – Jogula Venkatesh (2022)
Singer | Mounika Yadav Mamindla |
Composer | Kalyan Keys |
Music | Kalyan Keys |
Song Writer | Jogula Venkatesh |
Ma Galli lo okkadu poradu song Lyrics
మా గల్లీ ల ఒక్కడు పొరడు
అందగాడడు నన్ను సూస్తడు నన్ను సూసిన సూడనట్టుంటడు
నవ్వుతుంటడు కన్ను గొడ్తడు
సైగ చేస్తడు వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటు పిలిచి ముచ్చటంటాడు
ముద్దులు అంటడు సరసం అంటడు లొల్లి జేతడు ఇగ పొద్దునే మా వాడ ఒత్తాడు
కావాలి ఉంటడు అడ్డం వస్తాడు నన్ను కాలేజీ ఏమో పోనీయడు
బండి తెస్తాడు ఎక్కమంటాడు
పోదాం అంటడు నాకు ఊరు వాడ చూపిస్తాడు
జాతర అంటడు తోల్కవోతడు నేన్ అడిగింది నాకు కొనిస్తాడు
రాణి వంటడు రాజు వంటడు
మురిసిపోతాడు వాడు సక్కని మనసున్న పోరడు
ఉరిని ఇడవడు ఊర్లోనే ఉంటడు ఈ ఊరంతా నా ఒళ్ళే అంటడు
తోడు గుండటు సాయం అయితాడు
సాగిపోతాడు వాడు ఆస్తి పాస్తీ దండిగ ఉన్నోడు
కానీ లేనోడు అన్నట్టు ఉంటడు అందరితో కలిసి మెలిసి ఉంటడు
బుద్దిమంతుడు సదువుకున్నోడు సక్కనైనోడు వాడు సుక్కల్లో మెరిసేటి సేంద్రుడు
కాల్వగల్లోడు కాంతినవ్వోడు పరాయి అమ్మాయిలని సూడడు
దారి ఇస్తాడు పక్కకి ఏళ్తాడు
పారి పోతాడు మరి నేనంటెయ్ పడిసచ్చిపోతడునన్ను ఇడవడు కల్వరితడు వాడు పడుకున్న నాపేరు సతడు
మొండి గరమోడు మాయ చేసాడు
మనసు దోచాడు నా మేనత్త ముద్దుల పోరగాడు
వరస ఐనోడు మేన బావోడు నా మెడలోన తాళి కట్టేటోడు
ఏలువాడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు నా మేనత్త ముద్దుల పోరగాడు
వరస ఐనోడు మేన బావోడు నా మెడలోన తాళి కట్టేటోడు
ఏలువాడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు
0 Comments